Church of Christ Worship Songs Telugu Lyrics Now. Sunday Worship Songs in Church of Christ Srikakulam🙏👍
దేవా నీ దివ్య వాక్యము – ఈవిగా మాకు దొరికెను
పల్లవి: దేవా నీ దివ్య వాక్యము - ఈవిగా మాకు దొరికెను
హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా
1. పాపముతో నిండిన మమ్మున్-దీపము వంటి వాక్యముతో.. ఆ.. || 2 ||
కల్వరికి నడిపించి - కలుషములను తొలగించి
మా హృదయము వెలిగించెను ఓ.. || 2 || || దేవా ||
2. పాలవంటి వాక్యము - తేనె కంటే మధురము .. ఆ .. || 2 ||
వెండి బంగారంలా - వెల యెంత యైనను
తులతూగవు నీ వాక్యముతో .. ఓ .. || 2 || || దేవా ||
Church of Christ Worship Songs Telugu Lyrics Now
జీవితమంతా నీ ప్రేమగానం – ప్రణుతింతుమో యేసు ప్రభువా
పల్లవి: జీవితమంతా నీ ప్రేమగానం - ప్రణుతింతుమో యేసు ప్రభువా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ - ఆనంద గానంబుతో
1. సర్వ సమయములలో నీ స్తుతి గానం - ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున - స్తుతియింతుమో రక్షకా || జీవిత ||
2. సృష్టి అంతటిని నీ మాట చేత - సృజియించితివిగా మా దేవా దేవా
నీ ఘనమగు మహిమన్ వర్ణింప తరమా - స్తుతియింతుమో రక్షకా || జీవిత ||
3. కలుషాత్ములమైన మా కొరకు నీ - విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కలువరి గిరిపయ్ చూపిన ప్రేమన్ - స్తుతియింతుమో రక్షకా || జీవిత ||
Church of Christ Worship Songs Telugu Lyrics Now
యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
పల్లవి: యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను || 2 ||
1. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను || 2 ||
ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును || 2 || || యెహోవా ||
2. నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే || 2 ||
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను || 2 || || యెహోవా ||
3. నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను || 2 || || యెహోవా ||
Views: 15
Be First to Comment